కరీంనగర్- వరంగల్: జాతీయ రహదారిపై కేశవపట్నం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకుమారులు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల సమాచారం మేరకు…శంకరపట్నం మండలం మక్త గ్రామానికి చెందిన ఎస్.కె. అజీమ్ (38) తన కుమారుడు ఎస్.కె. రెహమాన్ (13) తో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, అతివేగంగా వచ్చిన ఓ లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అజీమ్, రెహమాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలనలు జరిపారు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.