జగిత్యాల జిల్లా: జగిత్యాల్ రూరల్ మండలం జాబితా పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డి దారుణహత్యకు గురి అయ్యాడు. పొద్దున బయటకు వెళ్లి తిరిగి ఇంటికి బైక్ వస్తున్న సమయంలో అతన్ని వెంబడించి వెనకనుండి కార్ తో గుద్ది కిందపడి ఉన్న గంగారెడ్డి ని నిందితుడు వ్యక్తి కత్తితో దారుణంగా విచక్షణా రహితంగా పొడిచి వేరే కార్ లో పరారి అయ్యాడు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు మొదలుపెట్టారు.గంగారెడ్డి బంధువులు అతని శరీరాన్ని తరువాతి కార్యక్రమాల కోసం హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు.పోలీసుల వైఫల్యం వలన గంగారెడ్డి హత్య జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్షలతో జరిగిన హత్యగా ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ కార్యకర్త హత్య జరగడం వెనుక ప్రతిపక్ష పార్టీ రాజ్యం అధికార పార్టీలో నడుస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఇక పార్టీని కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరియు నిండుతుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.