కరీంనగర్ జిల్లా : కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి విస్తృతంగా చర్చించారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం గురించి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులం వంటి అంశాలపై వివరణాత్మక సమాచారాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఈ సర్వే రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుంది. సేకరించిన సమాచారాన్ని బట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలందరికీ మేలు చేకూర్చేలా ఉంటాయి. అందుకే ఈ సర్వేను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలి.” అని అన్నారు.సర్వే నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని సందర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించాలని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సర్వేకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ తదితరులు ఉన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. Rakesh Gandhe.