మౌనంగా ఉండొద్దు..ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మహిళల రక్షణ కోసమే షీ టీంలు : సీపీ రామగుండం. మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) గారు తెలిపారు.
రామగుండం పోలీస్ కమీషనర్ ప్రధాన కార్యాలయంలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల షీ టీంల సభ్యుల పని తనానికి గౌరవం గా సీపీ గారు తన కార్యాలయం కూర్చోపెట్టి Coffee With She team Members ప్రోగ్రాం నిర్వహించి పని తీరు అభినదించి వారు మహిళల, విద్యార్థుల రక్షణ కోసం చేస్తున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, భవిష్యత్తు లో మహిళల రక్షణ కి చేయవలసిన కార్యక్రమాలు పై సీపీ గారు సమీక్ష సమావేశం నిర్వహించి వారితో మాట్లాడారు. మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలు సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్త గా ఉండాలన్నారు. ఆకతాయిలు మహిళలను, విధ్యార్ధినిలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, యువతులు ఏలాంటి సమస్యలు ఉన్నా ఎవరూ మౌనం ఉండకుండా నేరుగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలి. డయల్ 100 లేదా రామగుండం పోలీస్ కమీషనరేట్ షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700 కు లేదా నేరుగా షీ టీమ్స్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వేదికల మీదుగా కూడా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం అని సీపీ గారు తెలిపారు.
షీ టీం సభ్యులకు సీపీ గారు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది
ఈ సంవత్సరం నుండి కమీషనరేట్ పరిధిలో 205 అవగాహనా సదస్సు లు, 690 హాట్ స్పాట్స్ విజిట్, ఈవ్ టిసింగ్ పాల్పడుతున్న 22 మంది ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.18 ఫిర్యాదులు రాగా 04 FIR కేసులు, 11 ఈ-పెట్టీ కేసులు నమోదు చేవామన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను ఇబ్బందిలకు గురి చేస్తున్న 22 మంది ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వారి వద్ద నుండి 10 బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో 13 మంది మైనర్లు ఉండగా వారి తల్లితండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, పెద్దపెల్లి షీ టీం ఇన్చార్జి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమా, పెద్దపెల్లి మంచిర్యాల జిల్లాల షీ టీం సభ్యులు పాల్గొన్నారు.