లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర వెంకట్ నాయక్
హన్మకొండ: ఎస్టి లంబాడి కులం పేరుతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగంలో చలామణి అవుతున్న గోపు స్వర్ణలత పై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని హనుమమకొండ జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అజ్మీర వెంకట్ నాయక్ మాట్లాడుతూ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవేండి గ్రామానికి చెందిన గోపు బాలశౌర్ రెడ్డి 1963 లో కడవేండి చర్చి లో గోపు సుశీల ను వివాహం చేసుకున్నారు. వారికి హేమలత, స్వర్ణలత ఇద్దరు కూతుర్లు కడవేండి గ్రామంలో పుట్టారు. గోపు సుశీల వ్యక్తిగత కారణాలతో ఇద్దరు కూతుర్లు చిన్నగా ఉన్నపుడే తీసుకొని ఖాజిపేటకు వచ్చి ఫాతిమా నగర్ లో కిరాయి ఇంట్లో ఉంటూ ఆయగా ఉంటూ పిల్లలకు టీకాలు వేస్తూ ఉండేది. గోపు స్వర్ణలత ను రఘునాథ్ పల్లి మండలంలోని సెయింట్ అలఫోన్సిస్ స్కూల్ లో 2వ తరగతి నుండి 5 వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్ లో చదివింది. అప్పుడు స్కూల్ రికార్డ్స్ లో తండ్రి పేరు బాల షోర్ రెడ్డి అని పుట్టిన తేది 13.3.1971 అని ఉన్నది. గోపు సుశీల కొంత కాలం తరువాత భూక్యా అంకుష్ ఉన్న వీధిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటూ అంకుష్ కుటుంబం తో స్నేహం గా ఉన్నారు. గోపు స్వర్ణలత రఘునాథ్ పల్లి స్కూల్ నుండి వచ్చి ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ లో 6తరగతి లో చేరింది. అప్పుడు తండ్రి పేరు గోపు బాలేశౌర్ రెడ్డి కాకుండా భూక్యా అంకుష్ తండ్రి అని తప్పుగా నమోదు చేపించింది. అప్పుడే స్వర్ణలత పేరు మీద రెవిన్యూ అధికారుల నుండి ST సర్టిఫికెట్ తీసుకొని ST కొటాలో ఉన్న రిజర్వేషన్ అన్ని తీసుకొని చదివించింది.ఈ విషయం భూక్యా అంకుష్ కుటుంబానికి తెలియకుండా వారితో స్నేహంగా ఉన్నారు. 2009 లో ఆంధ్రప్రదేశ్ నూనెగింజల ఉత్పత్తి దారుల సహకార సమాఖ్య (ప్రస్తుతం తెలంగాణ నూనె గింజల ఉత్పత్తి దారుల సహకార సమాఖ్య ) లో స్వర్ణలత ST మహిళ రిజర్వేషన్ కొటాలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందినది. ప్రస్తుతం స్వర్ణలత డిప్యూటీ మేనేజర్ గా హైదరాబాద్ లో పనిచేస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే భూక్యా అంకుష్ గారి భార్య శ్రీమతి భూక్యా యమున, జాతీయ ST కమిషన్, న్యూ ఢిల్లీ కు, హన్మకొండ జిల్లా కలెక్టర్ కు, వరంగల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు 10.2.2023న మరియు 29.5.2023న ఫిర్యాదు చేయడమైనది. జాతీయ ST కమిషన్, న్యూ ఢిల్లీ వారు స్పందించి వెంటనే విచారణ చేసి 15 రోజులలో నివేదిక పంపుమని 19.4.2023న హన్మకొండ కలెక్టర్ గారిని ఆదేశించారు. రెండు సంవత్సరాలనుండి విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఈరోజు హన్మకొండ కలెక్టర్ P. ప్రావీణ్య గారిని కలిసి విచారణ వెంటనే పూర్తి చేసి రెడ్డి కులం నకు చెందిన స్వర్ణలత ST సర్టిఫికెట్ ను రద్దు చేసి ఆ ఉద్యోగం ను నిజమైన ST మహిళకు ఇవ్వాలని లంబాడా హక్కుల సంఘం నుండి విజ్ఞాపన పత్రం ఇవ్వడమైనది. వెంటనే ST సర్టిఫికెట్ రద్దు చేయని యెడల లంబాడా హక్కుల సంఘం నుండి పోరాట కార్యక్రమం చెప్పడతామని కలెక్టర్ గారిని కోరడ మైనది. ఈ కార్యక్రమం లో హనుమకొండ జిల్లా అధ్యక్షులు లావుడియా శ్రీనివాస్ నాయక్. సురేష్ నాయక్. గోవింద నాయక్ పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.