జగిత్యాల జిల్లా: తెలంగాణా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన జగిత్యాల ఏంల్యేసి జీవన్ రెడ్డి అనుచరుడి హత్య కేసులో నిందితుడు అదే రోజు లోంగి పోయినా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముగించుకొని ఈ రోజు అనగా శుక్రవారం రిమాండ్ కు తరలిస్తున్నట్లు సమాచారం.పోలీసులు పూర్తి సమాచారం అందించనప్పటికి హంతకుడు ఒక్కడే ఈ హత్య చేయడం వీలు కాదు కాబట్టి, ఎవరు సహకరించారు అందుకు గల కారణం రాజకీయమా లేక వ్యక్తిగత కక్ష్యలా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.కుటుంబ సభ్యుల వివరణ ప్రకారం మాత్రం బయట వ్యక్తులే హత్య చేయించడానికి పూర్తి పథకం తో సహకారం అందించారని చెబుతున్నారు. సంతోష్ ను హత్యచేయించేందుకు అతన్ని చాలా విధాల లోబరిచినట్టు వివరించారు.జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు డీఎస్పీ రఘుచందర్ లు ఈ కేసు గురించి వస్తున్న మీడియా కథనాలు, రాజకీయ కోణాలు కారణంగా పూర్తి క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. హంతకుని కాల్స్ డేటా ఆధారంగా హత్య ముందు రోజు నుండి అతను మాట్లాడిన ప్రతి వ్యక్తినీ, గ్రామస్తులను ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరో ముఖ్య అనుచరుని హత్య గత 5 నెలల క్రితం జరిగినట్టు తెలుస్తుంది. తన అనుచరులు ఇలా హత్య కుగురికావడం అతనికి పెద్ద సవాలుగా మారింది. దీనివెనుక ఎవరో పెద్ద కారణంతో ఉన్నట్లు జీవన్ రెడ్డి భావిస్తున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar