–టిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటున్నాడు.
–ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాటలకు అర్దం లేదు.
–మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావత్ వసంత సురేష్.
జగిత్యాల జిల్లా :-టిఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిపోయారని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావసంత సురేష్ అన్నారు. గురువారం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటీవల ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉందని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీని విడిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అర్థరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రోజే కాంగ్రెస్ వ్యక్తి అయ్యారని, టిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్లీ తాను టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాను అనడం చాలా విడ్డూరంగా ఉందని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోకపోతే గాంధీభవన్లో టి పి సి సి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెట్టిన సమావేశానికి ఎందుకు హాజరయ్యారని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని, జగిత్యాల లోని చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి దాకా అందరికీ తెలిసిందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒక వైద్యుడు, దీని దగ్గరికి ఒక పేషెంట్ వస్తే ఎలా ప్రవహిస్తాడో తెలిసిన వ్యక్తి మరి ఇలా ఎందుకు గారు అతని మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నారు. గతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు రాజకీయ జన్మమిచ్చింది టిఆర్ఎస్ పార్టీ మరియు ఎమ్మెల్సీ కవిత అని చెప్పి నిన్న మాత్రం కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కలిగిన కుటుంబం అని సోయి కొండ మాట్లాడుతున్నారు. ఆ కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అంటున్న ఎమ్మెల్యే గతంలో ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ జగిత్యాల మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాహుల్ గాంధీని పప్పు అని స్క్రిప్ట్ చదవాలని మరి ఎందుకు విమర్శలు చేశారన్నారు. పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్ ,ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ,కౌన్సిలర్ దేవేందర్ నాయక్, మాజీ ఎంఏఎంసి చైర్మన్ ప్రియాంక ప్రవీణ్, అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్ ,మాజీ జెడ్పిటిసి మహేష్, అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు ,రూరల్ మండలం సమన్వయ కమిటీ సభ్యులు పడగల గంగారెడ్డి, ఆనందరావు ,ఆసిఫ్, శ్రీనివాస్, గంగరాజం, రాయికల్ మండల సమన్వయ కమిటీ సభ్యుడు కొల్లూరు వేణు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ముత్తు,నాయకులు నక్క గంగాధర్, చింతల గంగాధర్ ,ప్రణయ్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. Shivacharan Chippa.