హైదరాబాద్ : ప్రస్తుతBNSS 126 (మునుపటి CrPC 107) కింద అదనపు జిల్లా మెజిస్ట్రేట్(ఎగ్జిక్యూటివ్ ) హోదాలో సివి ఆనంద్ ఐపీఎస్ గారు కోర్టు నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్‌లో నాంపల్లి నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్ నేతృత్వంలోని రెండు వర్గాలు తరచుగా గొడవ పడుతూ ఉండటంతో, పోలీసులకు శాంతి పరిరక్షణ సవాలుగా మారింది. ఇటీవల రెండు వర్గాలు వారు రోడ్డు పనులు పరిశీలన విషయంలో వీధుల్లో కొట్లాటకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టి, కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.ఇలాంటి సంఘటనలను నివారించడానికి, BNSS 126 కింద కేసులు నమోదు చేసి వారెంట్లు జారీ తర్వాత CP కోర్టులో హాజరు చెయ్యబడ్డారు. ఇరు వర్గాలు వారి యొక్క వాదనలు వివరిస్తూ ఒకరి కార్యక్రమాలకు మరొక వర్గం వారు ఏ విధంగా ఆటంకం కలిగిస్తున్నారో తెలియచేసారు. తర్వాత, వారు గొడవ పడిన వీడియోలు చూపించబడినాయి.మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మరియు అధికార పక్షానికి స్థానం ఉంటుంది అని, శాంతియుతంగా మెలగాలని వారికి సూచించాను. భవిష్యత్తులో పాటించవలసిన ప్రోటోకాల్ , ఇరువర్గాల మధ్య గొడవలు నివారించడానికి చేపట్టాల్సిన చర్యలు , తమ కార్యక్రమాలను పోలీసులకు ముందస్తుగా తెలియచెయ్యడం వంటి విషయాల పై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చారు .వారి భాష, దురుసుతనం ఉద్రిక్తలకు దారి తీస్తుండటంతో సరైన స్వీయ నియంత్రణ అవసరం ఉందని సూచించి కేసు మరలా విచారణకు వాయిదా వేయబడింది.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.