*- – – గంజాయి, డ్రగ్స్ కు బానిసై జీవితం నాశనం చేసుకోవద్దు*
*- – – సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి.
జగిత్యాల జిల్లా : వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ మోసాల నివారణ పై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా ఈ రోజు పోలాసా లోని అగ్రికల్చర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని సూచించారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు మానసికగా బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉంది అని అన్నారు. అనుకోకుండా ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత భలోపేతం చేస్తున్నట్లు తెలీపరు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించి న సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది అత్యంత అమానుష చర్య అని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్షణం కాదు అని తెలిపారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుకుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారు అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్ గారు, అగ్రికల్చర్ కళాశాల డీన్ భారత్ బట్,ADR శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి ఎస్ఐ సుధాకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Our Telangana Citizens Reporter.
Mr. MD Sharuf.