జగిత్యాల జిల్లా : పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని , వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయoలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ హాజరై పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్న జిల్లా ఎస్పీ గారు. ఈ వైద్య శిబిరంలో అధికారులకు,సిబ్బందికి నిపుణులైన Orthopedic, General physician, General surgery ,Ophthalmic, Genecology Cardiology వైద్యులతో నిర్వహించడంతో పాటు, సిబ్బందికి వైద్యులు తగు సూచనలు, సలహాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే ఉండడం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ఇది చాలా అవసరం అని అన్నారు. పోలీస్ అదికారులు, సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని పోలీసులు రాత్రింబవళ్లు పని చేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు లు,యోగ, క్రీడల నిరహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే గొప్ప సంపద అని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలను పాటించాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు.ఈ యొక్క హెల్త్ క్యాంపుకు సహకరించిన మెడికల్ హాస్పిటల్ డాక్టర్స్ కి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ శిభిరంలో 300 మంది పోలీస్ సిబ్బంది,వారి కుటుంబ సభ్యులకి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో మొదలగు సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
Our Telangana Citizen Reporter.
Mr. Shivacharan Chippa.