ఆన్లైన్ గేమ్స్ బంధాలను, బంధుత్వాలను ఎంతలా ఛిద్రం చేస్తున్నాయో ఈ సంఘటనతో మనకు అర్థమవుతోంది. పొద్దస్తమానం గేమ్స్ వాడొద్దని మంచి చెప్పిన కన్న తల్లినే కడతేర్చాడో కొడుకు. ఈ గేమింగ్ వ్యసనం కన్నవాళ్లను కడతేర్చేందుకు కూడా వెనకాడటం లేదు. ఆన్‌లైన్ ఆటలకు బానిసలుగా మారి ఎంతో మంది టీనేజర్లు, యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్నతనం నుంచే పిల్లలను తల్లిదండ్రులు ఆన్ లైన్స్ గేమ్స్ కు దూరంగా ఉంచాలి. బాల్యంలో గారాబం చేసి ఆడుకునేందుకు స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్ టాప్‌లు ఇవ్వడం ఆన్‌లైన్ గేమ్స్‌కి పిల్లలను బానిసలను చేస్తోంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య సరైన సంబంధాలు లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ వైపు ఆకర్శితులవుతున్నారు. ఎవరి ప్రపంచంలో వారు ఉండటం ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోంది. ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యువతను ఆన్‌లైన్ పందాలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చరించింది. -ట్వీట్‌లో వీసీ సజ్జనార్
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.