జగిత్యాల: జులై 20 జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యక్రమంలో నిర్వహించినటువంటి పత్రిక విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ ఇచ్చిన అవకాశంలో జగిత్యాల్ నియోజకవర్గంలో 9 ఆలయాలకు ఒక్కొక్క దానికి పది లక్షలు చొప్పున మంజూరు చేయడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం వేసిన కమిటీ ఏమి చర్యలు తీసుకున్నారు. మా పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. లక్ష రుణమాఫీ చేశామని, చెబుతూనే ,రూ రెండు లక్షలు మాఫీ చేస్తున్నట్లు పత్రిక ప్రకటనలు .ప్రకటనల కోసం కోట్ల రూపాయల విలువ చేసి ప్రకటనలు.రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్ లో రైతులకు ,కౌలు రైతులకు 15000 రైతు కూలీలకు 12000 ఎందుకు ఇవ్వలేదని అన్నారు. పాస్ బుక్ ప్రామాణికమైతే మళ్లీ రేషన్ కార్డు ఎందుకు అన్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న ఆయా రుణాల మొత్తాన్ని చెల్లించి డిపాల్టర్ల జాబితా నుండి రైతులను తొలగించి కొత్తగా రుణాలు మంజూరు చేయించాలో చర్యలు తీసుకోవాలన్నారు. రైతుబంధు కింద జూన్ లో ఇవ్వాల్సిన నిధులనుంచే రూ 7వేల కోట్ల రుణమాఫీకి దారి మళ్ళించి రైతులను మోసం రేవంత్ సర్కార్ అని అన్నారు. రైతులకు చేసేది రుణమాఫీ ప్రక్రియ కాదు ఎగనామ ప్రక్రియ అన్నారు.ఈ కార్యక్రమంలో దావ వసంత సురేష్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పిటిసిలు, చైర్మన్లు, కౌన్సిలర్లు ,సీనియర్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
SANJEEV BHANDARI