హైదరాబాద్: సిటీలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యు వాత పడ్డారు. బైక్ అతివేగంగా నడపడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తు న్నారు. బోరబండకు చెందిన ఆకాం క్ష్, రఘుబాబు,అనే ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్, వెళ్లే క్రమంలో పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో వీరి బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెంద గా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తు లో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.